రాజకీయ క్రీడలో నలిగిపోతున్న బ్యూరో క్రాట్లు….?

దేశంలోని బ్యూరో క్రాట్లు బిక్కుబిక్కుమంటున్నారు ఎందుకు…?

  • రూళ్ళ కర్రతో బాధ్యత గా పని చేసే అధికారులను ఇలా బేలగా మారిపోయారు ఎందుకు…?
  • చట్టాల లోని లొసుగుల్ని ముక్కుతో పసికట్టే యోధాను యోధులు… రాజకీయ క్రీడలో పడి నలిగిపోతున్నారెందుకు….?
  • * అడ్మినిస్ట్రేటివ్ అకాడమీలో నేర్చుకున్న పాలనా పాఠాలు రాజకీయ నేతలకు నేర్పడంలో విఫలం అయ్యారా….? నలిగిపోతున్నారా…?*

హైదరాబాద్ : ఎన్నో ఆశలతో ఆశయాలతో ఐఏఎస్, ఐపిఎస్ లతోపాటు అత్యున్నత హోదాలను దక్కించుకున్న వాళ్లు ఈ ఉన్నతాధికారులు అద్భుతమైన శిక్షణ నడత, నడవడికతో పాటు పాలనలోని విషయాలు, అందులోని లోపాలు, దేశంలో, రాష్ట్రంలో ఉన్న క్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దీటుగా, బలంగా, మానసికంగా శారీరకంగా, సమస్యల పట్ల లోతైన అవగాహనతో అన్ని అర్హతలు ఉన్న ఈ వైట్ కాలర్ బాస్ లు రాజకీయ నాయకుల కబంధహస్తాలలో నలిగిపోతున్నారా…..?

ఒక జిల్లాకి పోలీస్ బాస్ గా ప్రారంభమయ్యే ఐపీఎస్ ల కెరియర్ అంచెలంచలుగా ఎదిగి ఒక రాష్ట్రంలో డీజీపీ హోదా దాకా వెళుతుంది ఈ మధ్యలో వాళ్ళు గడిపే అపారమైన అనుభవాలు అందమైనవి కొన్ని ఉంటే మరిచిపోలేని చేదు జ్ఞాపకాలు చాలానే ఉంటాయి…. సగటు ఐపీఎస్ ఆఫీసర్లు మౌనంగా తమ పని తాము చేసుకునే పోయే వాళ్ళు ఎక్కువ మందైతే.ఇక కీలకమైన పదవుల్లో హోదాల్లో ఉంటూ విపరీతమైన మానసిక ఒత్తిళ్లతో తరచూ వివాదాస్పద విషయాలలో వినిపించి కనిపించే వాళ్ళు మరికొంతమంది.ఐపీఎస్ లు అందరూ అవినీతి బురదలో కూరుకుపోయిన వాళ్లేనని ఈమధ్య విపరీతంగా వినిపిస్తున్న మాట.. ఈ మాటల్లో నిజాలు కంటే అబద్ధాలు శాతమే ఎక్కువ. కొంతమంది పోకడలతో చేష్టలతో నిజాయితీపరులైన ఐపీఎస్ అధికారులు కూడా చాలా నష్టపోతున్నారు. ఇంత క్రెడిబిలిటీ ఉన్న ఐపీఎస్ లు ఇమేజ్ లాస్ కి కారణం కొన్ని ప్రచార మద్యమాలు కూడా కారణం అని చెప్పొచ్చు.ఒకటి రెండు సందర్భాలలో తప్ప ఎంతోమంది మంచి ఐపీఎస్ అధికారులు చేసిన మంచి పనులను ఎక్కడ ప్రచారానికి నోచుకోకపోవడం ఒక విషాదం.

ఒక్కసారి ఐపీఎస్ గా కెరియర్ ప్రారంభమై డీజీపీ స్థాయికి వెళ్లిన ఎంతోమంది అధికారులు వారు వారి వృత్తిలో ఎదుర్కొన్న అనుభవాలు సవాళ్లు సమస్యలు సమస్యల పరిష్కారానికి వాళ్లు పడ్డ శ్రమ వాళ్లకి వచ్చిన గుర్తింపు అప్పటికప్పుడే కనుమరుగైపోతున్నాయి… ఇదంతా ఒక ఎత్తైతే… రాజకీయ నాయకులు తరుచూపెట్టే ఫైల్, వారి పెట్టె ఒత్తిడి లో మునిగిపోయి, నలిగిపోయి మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న ఐపీస్ అధికారులు వందల మందే ఉన్నారు.ఐపీఎస్ గా నియామకమైన మొదట్లో ఈ దేశ ప్రజలకు ఏదో చేయాలని తపన పట్టుదల కనిపిస్తుంది. ఆ తర్వాత పరిస్థితుల్లో రాజీ పడిపోయే ధోరణి అలవాటు పడుతుంది. ఒక్కోసారి తమకు ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను తట్టుకోలేక ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్లే వాళ్ళు కొంతమంది అయితే, మినిస్టర్లు ఎమ్మెల్యేలు, ఎంపీ లు ఇతర రాజకీయ నాయకులకు నో చెప్పి పనిష్మెంట్లు బారిన పడి బదిలీలు ఇరుక్కుపోయే వాళ్ళు ఇంకొంతమంది. ఇక రాజీలు పడిపోయి ఎక్కడ సంతకాలు పెట్టాలో ఏ కేసును ఏ రకంగా డీల్ చేయాలో రాజకీయ నాయకులకు వదిలేసి ఎస్ బాస్ అంటూ తప్పని పరిస్థితుల్లో తల నేలకు వేసి కాలం వెళ్లబుచ్చుతున్న కొందరు అధికారుల సంగతి కూడా తెలిసిందే.

ఈ మధ్యకాలంలో చాలామంది రాజకీయ నాయకుల పై దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇన్కమ్ టాక్స్, ఈడి, సోదాల విషయంలో నలిగిపోతున్న ఐపీఎస్లు చాలామంది ఉన్నారు. వీళ్లంతా మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు రాజకీయ క్రీడల్లో నలిగిపోతున్నారు. వేలకోట్ల రూపాయల కుంభకోణాల్లో కూరుకుపోయిన రాజకీయ నాయకులు మౌనంగా ఉండిపోయి.కొంతమంది అధికారులను బాధ్యులుగా చేసే విషయంలో మరింత లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చేసే తప్పులు రాజకీయ నాయకులు చేస్తూ.ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ ను బలి చేస్తున్న రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ మధ్య కొందరు ఐపీస్ అధికారులు పడుతున్న బాధ వర్ణాతీతం.అటు రాజకీయ నాయకులకు చెప్పలేక ఇటు ఉన్నతాధికారులకు చెప్పలేక మానసిక వేదనకు లోనవుతున్నారు.కుటుంబాలతో సంతోషంగా గడపలేకపోతున్నారు.కొన్ని కార్యాలయలలో అంత తమ తమ హోదాల్లో వారికి వచ్చిన కష్టాల్ని చర్చించుకుంటున్న వైనం చూస్తుంటే.పరిస్థితి ఎంత తీవ్రత ఉందో రాజకీయ నాయకులు ఒత్తిడి ఐఏఎస్ ఐపీఎస్ ల పైన ఎంతవరకు ఉందో అర్థం అవుతుంది.

ఇక్కడ మరో విషయం కూడా గమనించాల్సిన అవసరం ఉంది ,కొన్ని కొన్ని ఘటనలు చూస్తుంటే రాజకీయ నాయకులు ఐపీస్ ఐఏఎస్ లను సొంత ప్రయోజనాలకు వాడుకోవడం లేదని తెలుస్తుంది. బ్యూరో క్రాట్లు రాజకీయ నాయకులను వాడుకుంటున్నారని కూడా తెలుస్తుంది.రాజకీయ నాయకులు అభద్రతాభావంతో బ్యూరోక్రాట్లను ఆడుకుంటున్నారు. సాధారణంగా గత చరిత్ర ఏమాత్రం చక్కగా లేని అధికారులు రాజకీయ నాయకులు జోక్యం గురించి గొంతు చించుకొని అరుస్తారు.బుద్ధిగా పనిచేసుకుపోయే అధికారులు పెద్దగా గొంతే ఎత్తరు.. కొందరు దివాలాకోరు అధికారులే వారికీ చేకూరే ప్రయోజనాల గురించి లేని పోనీ ఆశలు పెట్టుకొని రాజకీయ నాయకులను ఉచ్చులో పడిపోతున్నారు అనేది కదనలేని సత్యం..ఈ లోపాయి గారి విధానం ఇలా అన్ని శాఖల్లో నడుస్తుంది…ఒక బ్యూరోక్రాట్ ఒక రాజకీయ నాయకుడు వద్దకు వెళ్లి నేను మీ మనిషిని అని నమ్మబలికి పోస్టింగు,ప్రమోషన్, డిప్యూటేషన్, మరియు కొన్ని వ్యక్తిగత ప్రయోజనాలు అడుగుతాడు.ఇది కూడా కాదనలేని నిజ,తమ పదవులు, పలుకుబడి ఎప్పుడు పోతాయో తెలియని భయాందోళనలో ఉన్న రాజకీయ నాయకులు దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఎగిరి గంతేస్తారు.ఇక రాజకీయ నాయకుడు ధైర్యం చెబుతాడు మీకేం డోకా లేదు అని చెప్పి ఇటువంటి కొందరు అధికారులను మద్దతుదారులుగా అన్ని చోట్ల కూడగట్టుకోవాలి అనుకుంటారు.రాజకీయ నాయకుడిని తన కను సన్నల్లో మెలుగుతూ వ్యక్తిగతంగా అన్ని పనులు చేస్తూ మంచి అనిపించుకొనే పనిలో వారి వారి బాధ్యతను మరచి కొందరు అధికారులు మానసికంగా నలిగిపోతున్నారు అనే విషయం మరిచి భ్రమ లో బ్రతుకుతున్నరు అనేది కాదనలేని వాస్తవం.తాజాగా ఎం ఏ ల కొనుగోలు కేస్ ని సిట్ సరిగ్గా దర్యాప్తు చర్యలేదని వ్యాఖ్యానించడం కూడా ఒక సమర్థవంత అధికారిగా పేరు తెచ్చుకున్న అధికారికి కాస్త అవమాన కరంగానే భవించాల్సిన పరిస్తితి, నిజాలు,వాస్తవాలు అనే వాదన పక్కన్ పెడితే రాజ్యాంగం ప్రకారం ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సిన అధికారులు రాజకేయ నాయకుల ఒత్తిడితో తమ అస్థిత్వాన్ని కోల్పోయే పరిస్థితి రావడం దురదృష్టకరం.

ఏది ఏమైనా రాజకీయ నాయకుల ఆటల్లో నిజాయితీపరులైన అధికారులు నలిగిపోతున్నారు.

✍️✍️✍️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *