కోవాగ్జిన్‌ తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా టీకా తీసుకున్నారు. దిల్లీలోని ఎయిమ్స్​లో తొలి డోసును వేయించుకున్నారు. భారత్ బయోటెక్​ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాను ప్రధాని స్వీకరించారు. పుదుచ్చేరికి చెందిన నర్సు పీ నివేద సిరంజీ ద్వారా మోదీకి టీకా అందించారు. ఈ సందర్భంగా కొవిడ్​కు వ్యతిరేకంగా వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కృషిని ప్రధాని కొనియాడారు. అర్హులైనవారందరూ టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరం కలిసి భారత్​ను కరోనా రహిత దేశంగా మార్చాలని పిలుపునిచ్చారు.దిల్లీలోని సాధారణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించకూడదన్న ఉద్దేశంతోనే ఉదయం టీకా తీసుకున్నారు ప్రధాని. ఈ సందర్భంగా అసోంకు చెందిన గమ్చా(ప్రత్యేక వస్త్రం)ను ధరించారు. ఈ వస్త్రాన్ని అసోం మహిళల ఆశీర్వాదానికి గుర్తుగా భావిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *