మన్నె దంపతుల మౌన పోరాటం…???

మన్నె దంపతుల మౌన పోరాటం…???

  • 2018 సీన్ రిపీట్ కానుందా..?
  • కారు పార్టీలో ఖైరతాబాద్ సమీకరణాల కలకలం.

మన్నె గోవర్ధన్ రెడ్డి,హైదరాబాదులో పరిచయం అక్కర్లేని ఉద్యమ నాయకుడు.మొదటి నుండి కూడా పార్టీని అంటిపెట్టుకొని నగరంలో బిఆర్ఎస్ పార్టీకి విధేయుడైన నేతల్లో ఒకరిగా పేరుగాంచారు.
ఆయన భార్య మన్నె కవిత రెడ్డి కూడా ప్రస్తుత యాక్టివ్ కార్పొరేటర్లలో ఒకరు,అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ వారి సైలెన్స్ చూస్తుంటే రానున్న రోజుల్లో మరోసారి 2018 సీన్ రిపీట్ కానుందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అసలేం జరిగింది???

ఖైరతాబాద్ ని నియోజకవర్గంలో మంచిపట్టున్న నేతగా పేరుందిన మన్నే గోవర్ధన్ రెడ్డి 2018 ఎన్నికల సమయంలో పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు అయితే అప్పుడున్న పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదని భావించిన అధిష్టానం కొద్ది కాలం పాటు పెండింగ్లో ఉంచింది. మరోవైపు మాజీ మంత్రి దానం నాగేందర్ అదే సమయంలో పార్టీలో చేరడం కన్ఫామ్ కావడంతో ఇక తనకు టికెట్ రాదని భావించిన మన్నె గోవర్ధన్ రెడ్డి ఏకంగా పార్టీ ప్రధాన కార్యాలయం ముందు తన అనుచరులతో సహా భారీ నిరసనకు దిగారు. ప్రదర్శన కాస్త హింసాత్మకంగా మారడంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.ఈ ఆందోళనలో గాయపడ్డ మన్నే గోవర్ధన్ రెడ్డికి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స చేయాల్సి వచ్చింది.ఈ సంఘటన అప్పట్లో కలకలం రేపింది.అయితే ఆ తర్వాత అందరూ అనుకున్నట్టుగానే పార్టీ దానం నాగేందర్ కి ప్రాధాన్యత ఇవ్వడంతో మన్నే దంపతులు అలకబూనారు. తమ అనుచరుల కోరిక మేరకు పోటీకి సైతం దిగారు. టీడీపీ పార్టీ నుండి ఇద్దరు పోటీ చేయడానికి ముందుకు రావడంతో ఓట్లు చీలుతాయనే భయం అప్పట్లో అధిష్టానాన్ని వెంటాడింది. మరోవైపు ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ప్రజల్లో సైతం గోవర్ధన్ రెడ్డి దంపతుల పట్ల సానుభూతి కూడా విరివిగా ఉండేది.

అయితే ఆ తరువాత అధిష్టానం మన్నె దంపతుల బాధను అర్థం చేసుకొని వారికి తగు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించింది. ఉద్యమ కాలం నుండి పార్టీని అంటిపెట్టుకొని ఉన్న నాయకుడు కావడంతో ఆయన భార్య కవిత రెడ్డికి వెంకటేశ్వర కాలనీ కార్పొరేటర్ టికెట్ ఇచ్చింది. ఎన్నికల్లో గెలిచిన కవితా రెడ్డి పార్టీలో ఉన్న సిటీ కార్పొరేటర్లలో యాక్టివ్ గా ఉంటారని ప్రచారం ఉంది. అయితే ఈసారి ఎన్నికల్లో పరిస్థితులు మారడంతో మన్నే గోవర్ధన్ రెడ్డి ఆశిస్తున్నట్లుగా టికెట్లు ఇవ్వడం సాధ్యం కావడం లేదు.దీంతో గత నాలుగు నెలలుగా మన కవితా రెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.దీంతో మరోసారి 2018 సీన్ రిపీట్ అవుతుందేమోనని అటు ఆయన అనుచరులు ఇటు పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే కొందరు నేతల తప్పుడు ప్రచారం వల్లే తమకు ప్రాధాన్యత లేకుండా పోతుందని దంపతులు సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్న ఈ సమయంలో మళ్లీ ఇండిపెండెంట్గా మన్నె గోవర్ధన్ రెడ్డి పోటీ చేస్తే ఓట్లు పెద్ద ఎత్తున చీలే అవకాశం ఉంది. అయితే ఇలాంటి విషయాలను ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసిన సీఎం కేసీఆర్ ఖైరతాబాద్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ఏమైనా మన్నె దంపతుల మౌన పోరాటం ఎక్కడ వరకు వెళ్తుందో అని దానం వర్గీయులు టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.సానుభూతితోపాటు ఉద్యమకారుడు అని పేరున్న గోవర్ధన్ రెడ్డికి అన్యాయం జరిగిందని సొంత పార్టీ వారే భావిస్తున్న తరుణంలో ఈసారి దానం నాగేందర్ కి ఎన్నికల్లో కష్టాలు తప్పేలా లేవు.

By ఎన్.మల్లేష్ ( వార్త ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *